
బీజేవైఎం కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట బూట్ పాలిష్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు చెల్లించాల్సిన 33 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని కోరారు.