
ఎన్నికల అభ్యర్థుల నేర రికార్డులకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గానూ బీజేపీ, కాంగ్రెస్ సహా 9 రాజకీయ పార్టీలకు సుప్రీకోర్టు జరిమానా విధించింది. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయనందుకుగానూ బీజేపీ, కాంగ్రెస్, మరో ఐదు పార్టీలకు రూ. లక్ష చొప్పున, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ లకు రూ. 5 లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. భవిష్యత్తులో ఈ విషయానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కోర్టు రాజకీయ పార్టీలకు హెచ్చరించింది.