
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వం రంగ బ్యాంకు షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. ఉదయం 54,669 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొంది. చివరికి 318.05 పాయింట్ల లాభంతో 54,843,98 వద్ద ముగిసింది. నిష్టీ సైతం 82.10 పాయింట్ల లాభంతో 16,364.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.25 గా ఉంది.