https://oktelugu.com/

మోహన్ బాబుకు ఘోర అవమానం: ఆయన తినే కంచంలో మలం

ఎదిగే చెట్టుకే రాళ్లదెబ్బలంటారు. ఎంతో గొప్ప స్థితికి ఎదిగిన వారి చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో కష్టాలుంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవి చాలా ఎక్కువ. ఎన్నో కష్టాలు పడితే కానీ మన ముందట వాళ్లు స్టార్లు కాలేరు. సావిత్ర నుంచి మొదలుపెడితే నేటి చిరంజీవి, మోహన్ బాబు వరకూ సినిమా ఇండస్ట్రీలో అష్టకష్టాలు పడ్డవారే. ప్రతి ఒక్కరికి విజయం అంత ఈజీగా రాలేదన్నది వాస్తవం.. ఎన్నో అవమానాలు ఎదుర్కొనే ఆ స్థాయికి వచ్చారు. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2021 / 03:58 PM IST
    Follow us on

    ఎదిగే చెట్టుకే రాళ్లదెబ్బలంటారు. ఎంతో గొప్ప స్థితికి ఎదిగిన వారి చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో కష్టాలుంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవి చాలా ఎక్కువ. ఎన్నో కష్టాలు పడితే కానీ మన ముందట వాళ్లు స్టార్లు కాలేరు. సావిత్ర నుంచి మొదలుపెడితే నేటి చిరంజీవి, మోహన్ బాబు వరకూ సినిమా ఇండస్ట్రీలో అష్టకష్టాలు పడ్డవారే. ప్రతి ఒక్కరికి విజయం అంత ఈజీగా రాలేదన్నది వాస్తవం.. ఎన్నో అవమానాలు ఎదుర్కొనే ఆ స్థాయికి వచ్చారు.

    తాజాగా జీతెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో కమెడియన్ అలీ ఒక స్కిట్ చూసి ఏమోషనల్ అయ్యి మోహన్ బాబు గురించి ఒక సంచలన నిజాన్ని పంచుకున్నారు. ఈ షోకు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ అతిథిగా వచ్చారు. ఆ నిజం తెలుసుకొని ఆమె కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

    ఆర్టిస్టుల గొప్పదనం గురించి చెబుతూ కమెడియన్ అలీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ వేళ ఆర్టిస్టులకు పనిలేక వారు పడ్డ కష్టాల గురించి వివరించిన వారి ఏడుపులకు అలీ కరిగిపోయి మోహన్ బాబు కు జరిగిన ఓ ఘోర అవమానాన్ని చెప్పుకొచ్చాడు. అలీ చెప్పిన ఆ మాటలు అందరినీ కదిలించాయి. ఆమె కూతురు మంచి లక్ష్మీని కంటతడి పెట్టించాయి.

    అలీ మాట్లాడుతూ.. ‘అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మోహన్ బాబుకు డబ్బులు లేక ఇంటి అద్దె కూడా మూడు నాలుగు నెలలు కట్టలేదని.. ఇంటి అద్దె కట్టకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్న మోహన్ బాబును ఖాళీ చేయించాలని ఆ ఇంటి ఓనర్.. మోహన్ బాబు తినే కంచంలో మలాన్ని వేశాడని’ సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు.సినీ ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో మోహన్ బాబు చాలా కష్టాలు పడ్డాడని ఈ సందర్భంగా వివరించాడు.

    -మోహన్ బాబుపై అలీ చేసిన కామెంట్ల వీడియోను కింద చూడొచ్చు