
ఇంగ్లాండ్ తో రెండో టెస్టు సందర్భంగా టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వచ్చారు. అండర్సన్ తొలి ఓవర్ వేశాడు. అయితే అండర్సన్ వేసిన తొలి ఓవర్ లో రోహిత్ సింగిల్ తీశాడు. కాగా, రెండో టెస్టు ప్రారంభానికి ముందు కూడా కాసేపు చినుకులు కురవడంతో మ్యాచ్ ఆరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో కొత్తగా మహ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు.