లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్ సభ చివరిసారి సమావేశమైంది. నిజానికి ఈనెల 13వరకు సభలు జరగాల్సి ఉంది. కానీ గత రెండు వారాల నుంచి విపక్షాలు సభలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ విపక్షాల తీరును తప్పుపట్టారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మృతికి సంతాపం తెలిపారు. లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.