
మరికొద్ది నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో ఏదైనా తప్పు జరిగితే కెప్టెన్సీ మార్పులు చోటుచేసుకుంటాయని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ టీమ్ ఇండియా ఓటమిపాలవ్వడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సామర్థ్యంపై మరోసారి అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన దీప్ దాస్ ఈ ప్రపంచకప్ తో కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యంపై స్పష్టత వస్తుందన్నాడు.