హీరో రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి చేయబోతున్న సినిమాకి బ్రేక్ పడిందని బాగా వినిపించింది. రామ్ కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయి మరీ, లింగుస్వామి పై కేసు పడగానే ఆగిపోయాడని అన్నారు. కానీ వ్యవహారం చాల సజావుగానే సాగుతుంది. రామ్ తో లింగుస్వామి చేస్తోన్న సినిమాని ఆపాలని తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.
నిజానికి లింగుస్వామి, జ్ఞానవేల్ రాజా మధ్య చాల రోజుల నుండి గొడవలున్నాయి కాబట్టే.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్స్ కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. వాస్తవానికి సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు లింగుస్వామి. అయితే ఆ తర్వాత తానూ చెయ్యాల్సిన సినిమా చెయ్యకుండా, లింగుస్వామి సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టాడు.
దాంతో జ్ఞానవేల్ రాజా ఫిల్మ్ ఛాంబర్ లతో పాటు హీరో రామ్ కి కూడా సినిమా చేయాలని ఫిర్యాదు చేశాడు. కానీ హీరో రామ్ ఈ ఫిర్యాదుని లైట్ తీసుకుని షూట్ కి రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి.
అన్నట్టు ఈ సినిమా షూటింగ్ సాంగ్ తోనే మొదలు కానుంది. సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సాంగ్ ను తీయనున్నారు. పైగా ఈ సినిమా కథ అదిరిపోయిందని ఇటీవలే రామ్ ట్వీట్ చేశాడు. ట్రేడ్ వర్గాల్లో సినిమాని హాట్ కేక్ గా మలిచింది.