
ఐదు టెస్టుల సిరీసులో బంతి స్వింగ్ అయితే టీమ్ ఇండియా ఇబ్బందులు పడుతుందని ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ అంటున్నాడు. భారత్ కు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉన్నా కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనతని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేశాడు. టీమ్ ఇండియా గొప్ప జట్టు. కానీ స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం వారి బలహీనత. ఆగస్తు నెలలో వాతావరణం చల్లగా ఉండి, బౌలర్లు అనుకూలిస్తే ఇంగ్లాండ్ కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అని కుక్ అన్నాడు.