https://oktelugu.com/

Singles Day : సింగల్‌గా ఉండడం మంచిదేనా.. లాభ నష్టాలు ఇవీ..!

ప్రేమికుల దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మాతృ దినోత్సవం, బ్రదర్స్‌ డే, సిస్టర్స్‌ ఉన్నట్లే ఉన్నట్లుగానే.. సింగిల్స్‌(ఒంటిరి) డే కూడా ఉంది. ఏటా నవంబర్‌ 11న సింగిల్స్‌ డే నిర్వహిస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 11, 2024 / 02:25 PM IST

    Singles Day

    Follow us on

    Singles Day :  ప్రపంచంలో ప్రతీ రోజుకు ప్రాధాన్యం ఉంది. ప్రతీ తేదీకి ఒక ప్రాధాన్యం ఉంది. కొన్ని రోజులు క్యాలెండర్‌ ప్రకారం పాటిస్తే.. కొన్ని పర్వ దినాలను గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా పాటిస్తుంటా. పండుగలను ఎక్కువగా పంచాంగం ఆధారంగా మన దేశంలో ఎక్కువగా పాటిస్తాం. ఇక పుట్టిన రోజులు, జయంతులు, వర్ధంతులు, కొన్ని ముఖ్యమైన తేదీలను క్యాలెండర్‌ ఆధారంగా పాటిస్తాం. కొన్నింటిని నెలలో వచ్చే ఫస్ట్‌ సండే, సెకండ్‌ సండే, థర్డ్‌ సండే లేదా ఇతర రోజుల ఆధారంగా పాటిస్తాం. ఇలా అన్ని రోజులు ఉన్నట్లుగానే సింగల్స్‌కూ ఒక రోజు ఉంది. సింగల్‌ అంటే ఎలాంటి బంధాలు, బాంధవ్యాలు లేకుండా ఒంటరిగా జీవించే వాళ్లు అన్నమాట. ఏటా నవంబర్‌ 11న ఈ రోజు నిర్వహిస్తుంటారు. ఒంటరిగా ఉండేవారు సెలబ్రేట్‌ చేసుకుంటారు. మరి ఈ సింగిల్స్‌ డే ఎలా ప్రారంభమైంది.. దాని వెనుక ఉన్న చరిత్రత.. సింగిల్‌గా ఉండడం వలన కలిగే లాభ నష్టాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం.

    సింగిల్స్‌ డే చరిత్ర..
    నాన్‌జింగ్‌ యూనివర్సిటీలో 1993లో నలుగురు యువకులు.. వాలంటైన్‌సడేకి వ్యతిరేంగా.. తాము సింగిల్‌ అని చెప్పుకుంటూ.. దానిని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఈ సింగిల్స్‌ డేని ప్రారంభించారు. చైనాలో అయితే ఈరోజున సెలవు తీసుకుని మరీ సెలబ్రేట్‌ చేసుకుంటారు. మరి సింగిల్‌గా ఉండడం వలన కలిగే బెనిఫిట్స్‌ ఉన్నాయా.. సింగిల్‌గా ఉండడం వలన కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం..

    లాభాలు ఇవీ..
    సింగిల్‌గా ఉండే వారికి ఫ్రీడమ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కోసం తమ ఇష్టాలు వదులుకోవాల్సిన అవసరం రాదు. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టిపెడతారు. తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తారు. నచ్చింది తింటారు. ఎవరినీ కలవాల్సిన అవసరం ఉండదు. ఏ సమయంలో అయినా.. ఎక్కడికైనా.. ఎలా అయినా వెల్లొచ్చు. తమ కోసం తప్ప ఇతరుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రొఫెషనల్‌ గోల్స్‌ని రీచ్‌ అవుతారు. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు అనే బాధలు ఉండవు. డబ్బులు వెనకేస్తారు. వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు. సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. నచ్చిన పనులు చేసుకుంటారు. హామీలు, అలవాట్లు మార్చుకునే అవసరం ఉండదు. రిలేషన్‌షిప్‌లో ఉండే ఇబ్బందులు, చికాకులు ఉండవు. కాంప్రమైజ్‌ అనే ముచ్చటే ఉండదు. తనను తానే ప్రేమించుకుంటారు.

    నష్టాలు..
    ఇక సింగిల్‌గా ఉండడం వలన నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో లోన్లీగా ఉంటారు. ఎవరైనా తోడుంటే బాగుండు అనిపిస్తుంది. సొసైటీ ప్రెజర్‌ ఉంటుంది. ఫ్యామిటీ సొసైటీ నుంచి ప్రెజర్‌ వస్తుంది. ఆర్థికంగా అదుపు ఉండదు. చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం ఉంటుంది. నియంత్రణ ఉండకపోవడంతో మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పార్ట్‌నర్‌ ఉంటే జీవితం బాగుంటుంది అని అనిపిస్తుంది. కష్ట సుఖాలను షేర్‌ చేసుకునే అవకాశం ఉండదు. నిర్ణయాలు తీసుకోవడంలోనూ తప్పులు చేస్తారు. సెలబ్రేషన్స్‌కు తోడు లేకుండా వెళ్లడానికి ఇబ్బంది పడతారు. డిప్రెషన్, యాంగై్జటీ ఎక్కువ ఉంటుంది. హెల్త్‌ బాగాలేనప్పుడు ఎవరైనా పక్కన ఉండాలని అనిపిస్తుంది.

    సింగిల్స్‌ చేయాల్సినవి..
    ఇక సింగిల్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మంచి రిలేషన్‌షిప్‌ మెయింటేన్‌ చేయాలి. మీ హామీలను వదులుకోకూడదు. ప్రీటైంలో వాటిపై ఫోకస్‌ పెట్టాలి. సెల్ఫ్‌ కేర్‌ తీసుకోవాలి. ఇతరుల నుంచి పాజిటివ్స్‌ తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కంగారు పడొద్దు.