https://oktelugu.com/

Samantha : నాకు తల్లి కావాలని కోరికగా ఉంది..కానీ ఆ సమస్యలు వెంటాడుతున్నాయి అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

ఎన్నో కష్టాలను పడి సిటాడెల్ : హానీ బన్నీ వెబ్ సిరీస్ ని పూర్తి చేసింది సమంత. ఈ సిరీస్ లో సమంత ఒక బిడ్డకి తల్లి పాత్ర పోషించింది. సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పోషించిన తల్లి పాత్ర గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 02:45 PM IST

    Samantha

    Follow us on

    Samantha :  సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన ‘సిటాడెల్ : హానీ బన్నీ’ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్, ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకి మయోసిటిస్ వ్యాధి సోకినప్పుడు, శస్త్ర చికిత్స తీసుకుంటున్న సమయంలో చేసిన వెబ్ సిరీస్ ఇది. యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు సమంత కి ఎన్నో గాయాలు అయ్యాయి. అంతే కాకుండా సమంత మయోసిటిస్ కారణంగా ఊపిరి ఆడేది కాదు. అందుకే షాట్ బ్రేక్ దొరికినప్పుడల్లా ఆమె ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునేది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె స్పృహ తప్పి కుప్పకూలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. అలా ఎన్నో కష్టాలను పడి ఈ వెబ్ సిరీస్ ని పూర్తి చేసింది సమంత. ఈ సిరీస్ లో సమంత ఒక బిడ్డకి తల్లి పాత్ర పోషించింది. సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పోషించిన తల్లి పాత్ర గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ అమ్మాయికి ఉన్నట్టుగానే నాకు కూడా తల్లి కావాలనే కళలు ఉన్నాయి. ఒక బిడ్డకి అమ్మగా ఉండేందుకు నేను ఎంతో ఆనందిస్తాను. ఇప్పుడు అది ఆలస్యమైంది కదా అని నేను బాధపడడం లేదు. భవిష్యత్తులో కచ్చితంగా అవుతాను. కానీ అంతకంటే ముందు నేను జీవితం లో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నో సమస్యలను సెటిల్ చేయాలి. ప్రస్తుతం ఉన్న జీవితంతో నేను సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది సమంత. ఇకపోతే ఈ సినిమాలో సమంత కి కూతురుగా నటించిన అమ్మాయి పేరు కస్మి మజ్ముందర్. తెలివైన అమ్మాయి గా ఎంతో క్యూట్ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ చిన్నారి వయస్సు కేవలం 8 ఏళ్ళు మాత్రమే. ఈమె సిటాడెల్ ప్రొమోషన్స్ కూడా పాల్గొంది.

    ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఈమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. ఇప్పటికే ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించేందుకు అంగీకారం తెల్పిన సమంత, ఇక నుండి రెగ్యులర్ హీరోయిన్ రోల్స్, ఐటెం సాంగ్స్ చేయనని, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మూవీ లో సమంత ని హీరోయిన్ గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. మరి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా ఇక మీదట చేయను అని చెప్పిన సమంత, ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. అయితే ఈమెకు రామ్ చరణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్నందున ఈ ఒక్కసారికి రెగ్యులర్ హీరోయిన్ గా నటించేందుకు అవకాశం ఉంది.