https://oktelugu.com/

BRS : సోషల్ మీడియాను నమ్ముకుంటే బీఆర్ఎస్ కు అధికారం వస్తుందా?

గత పదేళ్లుగా అధికారంలో ఉండి.. ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక అధికారం పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉండిపోయారు. ప్రజా సమస్యలను కానీ.. కార్యకర్తలను కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ.. ఇటీవల కేసీఆర్ ఫాంహౌస్ వేదికగా పాలకుర్తి నేతలతో భేటీ అయ్యారు. వారితో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మనమే అధికారంలోకి రావడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు ఏం కోల్పోయారో చూశారని, ప్రజలకు కాంగ్రెస్ పాలన గురించి అర్థమైపోయిందని అన్నారు. మరోవైపు.. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. అదే చెప్పి అధికారులను భయపెడుతూ వస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 11, 2024 / 02:17 PM IST

    Will BRS get power if we trust social media?

    Follow us on

    BRS : అయితే.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నాయి. ఫీల్డుపరంగా ఏపాటి ఉందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాను ప్రధానంగా నమ్ముకుంటున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. పట్టుమని పది మంది కూడా లేకుండానే కొంత మందిని వెంటేసుకొని డ్రామాకు దిగారు. అయితే.. ఇదంతా సోషల్ మీడియా కోసమే అన్న టాక్ ఉంది. కౌశిక్ హడావుడిని కేవలం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేసుకుంది. రెండు యూట్యూబ్ చానళ్లు, మూడు ట్విట్టర్ పోస్టులు కనిపించాయి. కానీ.. పెద్దపెద్ద మీడియాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితులు అయితే లేవు. అది బీఆర్ఎస్ నేతలకూ తెలుసు. అందుకే.. కొద్దిపాటి హడావుడి చేసి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

    అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు మీడియా ఉంది. ఇప్పుడు కూడా ఉంది. అయితే.. గతంలో సొంత మీడియాను పట్టించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఆ తప్పు చేయొద్దని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చానళ్లను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అలాగే.. మరికొన్నింటిని కొనేందుకు కూడా సిద్ధపడినట్లుగా టాక్. వాటి వాటిని కొనడంతో పాటు మరికొన్నింటిని కొత్త వాటిని మనుగడలోకి తేవాలని భావిస్తోంది. కేసీఆర్ చాలా కాలం తరువాత మాట్లాడినప్పటికీ పెద్దగా ప్రచారం దొరకలేదు. గదే సోషల్ మీడియాలో మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియాపైనే ఫోకస్ పెడుతున్నదట. అయితే.. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియాను నమ్ముకోవడంపై విమర్శలుూ వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవల్‌లో సోషల్ మీడియాను ఫాలో అవుతున్నప్పటికీ ఎంతవరకు నమ్ముతారనేది తెలియనది కాదు. గ్రౌండ్ లెవల్‌లో అభిప్రాయాలు తెలుసుకోకుండా కేవలం సోషల్ మీడియాపైనే ఆధారపడాలని అనకుంటే అంతకంటే అమాయత్వం ఉండదన్న అభిప్రాయం వెల్లడవుతోంది. కాస్త బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ అభిప్రాయం తీసుకోనైనా ముందుకు సాగాలని అంటున్నారు. కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం భ్రమే అవుతుందని వారు అంటున్నారు. వచ్చేసరికి అధికారంలోకి రావాలనుకుంటున్న బీఆర్ఎస్ కలలు కేవలం సోషల్ మీడియా ద్వారానే సాకారం అవుతాయా.. బీఆర్ఎస్ తన స్టాండ్ మార్చుకుంటుందా అన్నది చూడాలి.