
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు నగలు పట్టుపడ్డాయి. అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ. కోటీ 80 లక్షల వరకు ఉంటుందని సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వాహనంలో వీటిని ఏపీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆభరణాలను సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు.