Site icon OkTelugu

తెలంగాణలో విస్తారంగా వర్షాలు

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. శుక్రవారం ఏర్పాడిన అల్పపీడనం వాయువ్య బంగాళాకాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించడంతో రాగల రెండు నుంచి మూడూ రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయిువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర్ ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Exit mobile version