ఆ నిర్మాత సైడ్ బిజినెస్ ఫుల్ సక్సెస్ !

ollywసినిమా వాళ్ళు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఓ నిర్మాత బిల్డర్ అవతారం ఎత్తాడు. చక్కని విల్లాలను నిర్మించి, అమ్మడంలో ఆ నిర్మాత బాగా ముదిరిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రముఖుల దృష్టి అంతా విల్లాల మీదే పడింది. డైరెక్టర్లు, రైటర్లు అలాగే మిగిలిన సినీ ప్రముఖులు తమకు మంచి హిట్ పడగానే భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. మరి భారీగా సంపాదన ఉన్నప్పుడు ఇంకా ఎందుకు అపార్ట్ […]

Written By: admin, Updated On : June 12, 2021 6:48 pm
Follow us on

ollywసినిమా వాళ్ళు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఓ నిర్మాత బిల్డర్ అవతారం ఎత్తాడు. చక్కని విల్లాలను నిర్మించి, అమ్మడంలో ఆ నిర్మాత బాగా ముదిరిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రముఖుల దృష్టి అంతా విల్లాల మీదే పడింది. డైరెక్టర్లు, రైటర్లు అలాగే మిగిలిన సినీ ప్రముఖులు తమకు మంచి హిట్ పడగానే భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.

మరి భారీగా సంపాదన ఉన్నప్పుడు ఇంకా ఎందుకు అపార్ట్ మెంట్ ల్లో లైఫ్ ను ఎడ్జెస్ట్ చేసుకుని లీడ్ చేయడం ? అందుకే, హిట్ రాగానే సింపుల్ లైఫ్ కు స్వస్తి చెప్పి, విల్లాలకు షిప్ట్ అయిపోతున్నారు సినిమా వాళ్ళు. ముఖ్యంగా కుర్ర డైరక్టర్లు మొదటి హిట్ అందుకోగానే తర్వాత టార్గెట్ విల్లానే అయింది. గతంలో ఇండిపెండెంట్ హౌస్ ల పై ఆసక్తి ఉండేది అందరికీ.

కానీ, రోజులు మారే కొద్దీ, మనుషుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లకు విల్లా కల్చర్ బాగా అలవాటు అయింది. దర్శకుడిగానో నటుడిగానో ఓ హిట్ కొట్టిన తరువాత అడ్వాన్స్ ల రూపంలోనే భారీ ఎమౌంట్ వస్తుండే సరికి సినీ జనానికి కూడా కోట్ల రూపాయలు కూడా పెద్ద ఎమౌంట్ లా అనిపించడం లేదు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓ నిర్మాత సీక్రెట్ గా విల్లాల నిర్మాణం చేస్తూ.. సినీ ప్రముఖులకు అమ్ముతూ మంచి బిజినెస్ చేస్తున్నాడు. పాపం, సక్సెస్ ఫుల్ సినిమాలు చేయలేక పోయినా, ఆ నిర్మాత మాత్రం విల్లాల బిజినెస్ ను మాత్రం ఫుల్ సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. ఇక ఒక్కో విల్లాకి ఈ నిర్మాత 12 కోట్లు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.