మమతా బెనర్జీ పై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యస్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మమత ఆలస్యంగా రావడాన్ని ఉద్దేశిస్తూ ప్రజాసేవలపై అహం ప్రభావం చూపిస్తోంది అని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యాఖ్యలను అధికార తృణమూల్ పార్టీ ఖండించింది. సీఎం మమతా బెనర్జీ నిరంతరం ప్రజల కోసమే పని చేస్తున్నారని గవర్నర్ ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలిపింది.
Written By:
, Updated On : June 1, 2021 / 08:39 PM IST