కరోనా వేళ ఆపన్నహస్తం అందిస్తున్న సోనూసూద్ వారి సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఏ సమయంలో పిలిచినా నేనున్నానని తక్షణమే స్పందిస్తున్నాడు. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోనూసూద్ నిజజీవితంలో కథానాయకుడిగా మారారు. పంజాబ్ లో ని మారుమూల ప్రదేశంలో పుట్టిన సో నూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. ఆయనకు బాలీవుడ్ అవకాశాలు రాక ముందే తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి.1999లో విడుదలై తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తమిళంలో మరో సినిమా చేసినా గుర్తింపు రాలేదు.
తెలుగులో శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో వచ్చిన హాండ్స ప్ అనే సినిమాలో సోనూసూద్ నటించినా ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు దొరకలేదు. తెలుగు, తమిళ సినిమాలు అలాగే హిందీ సినిమాలు ఇలా వేటినీ వదలకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. మొత్తానికి తెలుగులో ప్రతినాయకుడి పాత్రల్లో ఒదిగిపో యారు. ప్రస్తుతం తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
2005లో నాగార్జున కథానాయకుడిగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా రిలీజయిన తరువాత అతడు సినిమా కూడా విజయవంతమైంది. దీంతో సో నూసూద్ కు అవకాశాలు రావడంతో బిజీగా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.
సోనూసూద్ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో నూసూద్ చేస్తున్న పనులను చూసి ప్రశంసిస్తున్నాడు. ప్రభుత్వాలు చేయలేని గొప్ప పనులు చేస్తున్నాడని కితాబిచ్చారు. అయితే ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు తేదని చెబుతూనే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాలుగైదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి తమ్మారెడ్డి తెలిపారు. ఆ సమయంలో సోనూసూద్ ఎంత కమర్షియల్ గా వ్యవహరించేవాడోనని పేర్కొన్నారు. వికలాంగుల చారిటీ కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం రమ్మని అడిగితే డబ్బులు ఇస్తేనే వస్తానన్నాడని వివరించారు. అప్పుడు అంత కమర్షియల్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం దేవుడిలా కనిపిస్తున్నాడని చెప్పారు.