
జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల పేరుతో కోట్ల రూపాయలు దోచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కాకినాడ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జగన్ పరిపాలన అప్పట పరిపాలన అని విమర్శించారు. రాష్ట్రంలో మతపరమైన పరిపాలన జరుగుతోందన్నారు. రైతులకు ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు.