బోల్డ్ భామ ‘అమలాపాల్’ ఇటీవల ఓ వ్యక్తి తొడపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ అతనితో సరదాగా కనిపించింది. సహజంగా ఇలాంటి ఫోటో చూస్తే.. తప్పుగానే అర్ధం చేసుకునే సమాజం ఇది. ఈ ఫోటోను అమలాపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన దగ్గర నుండి.. మరో ప్రియుడ్ని పట్టింది, అమలాపాల్ మళ్ళీ కొత్త వ్యక్తితో ప్రేమలో పడి నానిపోతూ ఉంది అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు.
ఈ వార్తలు చక్కర్లు కొట్టడం, ఆ కామెంట్స్ అమలాపాల్ కంటపడటం, మొత్తానికి ఆమె వీటన్నింటి పై క్లారిటీ ఇచ్చింది. ‘అవును, అతను నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. కానీ అందరూ అనుకున్నట్టు తను నాకు ప్రియుడు కాదు. నాకు సోదరుడు’ అంటూ తెలిపింది. బ్రదర్ అని అమలాపాల్ చెప్పగానే ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడి మోసపోతే, మేం తట్టుకోలేం అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ‘మైనా’ అనే చిన్న సినిమాతో పెద్ద గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్. కెరీర్ మొదట్లో బూతు సినిమాలు చేసినా, ఆ తర్వాత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోల సరసన ఆడిపాడే స్థాయికి ఎదిగింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫుల్ డిమాండ్ ఉన్న సమయంలో దర్శకుడు ఏఎల్ విజయ్ తో ప్రేమలో ముగినిపోయి, 2014లో అతన్ని పెళ్లి చేసుకుని చివరకు అతనితో విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తోంది.
అయితే, తన భర్తతో విడిపోయిన తర్వాత తనకు పూర్తి స్వేచ్చ వచ్చిందని, ఇప్పుడు తాను స్వేచ్ఛాజీవిగా మారాను అని, ఈ గ్లామర్ ప్రపంచంలో తానూ ఇక గ్లామర్ పాత్రలకే కట్టుబడి ఉంటానని, నన్ను ఈ స్థాయికి తెచ్చిన అభిమానులకు, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతూనే ఉంటానని ఆ మధ్య ఎమోషనల్ పోస్ట్ లు కూడా పెట్టింది అమలాపాల్. ఈ క్రమంలోనే ‘ఆడై’ అనే చిత్రంలో 16 రోజుల పాటు న్యూడ్ గా కూడా నటించి మెప్పించింది. ప్రేక్షకుల సంతోషం ఏమైనా చేసేలా ఉంది అమలాపాల్.