గ్రామసర్పంచ్ కు ఫోన్ చేసి దావత్ చేసుకుందామని స్థలం చూడాలని సూచించారు. ఆ ఫోన్ సంభాషణ మీడియాకు అందేలా చేశారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి వాసాలమర్రి గ్రామానికి ఈనెల 22న వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గ్రామ అభివృద్ధిపై ప్రజలతో చర్చించి అక్కడే గ్రామస్తులతో కలిసి భోజనం చేయాలని సంకల్పించారు.
ఆ గ్రామాన్నిదత్తత తీసుకోవాలని గతంలో ప్రకటించారు. తరువాత మరిచిపోయారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో మరే కారణమో కాని గ్రామాన్నిదత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని గ్రామస్తులు అభిలషిస్తున్నారు.
ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా గ్రామాలపై వందల కోట్ల వరాలు ప్రకటిస్తున్నారు. వాటి అమలుపై పట్టించుకోవడం లేదు. దీనిపై ఎవరు స్పందించడం లేదు. ప్రాజెక్టుల విషయంలో, గిరిజనుల పోడు భూముల విషయంపై తానే జిల్లాలు తిరిగి పరిష్కరిస్తానని చెప్పుకుంటుంటారు. వాసాలమర్రికి ఎన్ని వరాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.