
వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకవిధానాలతో ప్రజలను దారుణంగా వంచించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం సోమువీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, దళారులు, మిల్లర్లు కలిసి రైతులను ముంచేస్తున్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని, మతాన్ని అణచివేస్తూ అన్యమతాలను ప్రోత్సహిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇసుక, మధ్యం సరఫరాలో ఈ ప్రభుత్వం అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తిగా గాడితప్పిందని, వ్యవస్థలు మొత్తం అవినీతి మయమైపోయాయని దుయ్యబట్టారు.