
ఏపీలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజినీరింగ్ కాలేజీల్లోని ‘బీ’ కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్లు ఇకపై మెరిట్ విద్యార్థులకే దక్కనున్నాయి. గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి మాత్రమే ఇచ్చేవి. దీని వల్ల మెరిట్ స్టూడెంట్స్ కు నష్టం జరిగేది. దానిని సవరిస్తూ బీ కేటగిరీ కింద ఉండే 30 శాతం సీట్లను కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.