
ఆసక్తికరంగా ఓవల్ లో పోరు. బ్యాటుతో బలంగా పుంజుకున్న టీమ్ ఇండియా బలమైన స్థితిలో నిలిచింది. శార్దూల్, పంత్ జోడీ ఆశలు రేకెత్తించింది. అయినా సమతూకంగానే ఆట అయిదో రోజుకు చేరుకుంది. బ్యాటింగ్ మరింత తేలికైన నిర్జీవమైన పిచ్ పై నాలుగో టెస్టు ఎలా ముగుస్తుందన్నది ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. ఇంగ్లాండ్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 368 పరుగుల లక్ష్యంలో ఆ జట్టు అప్పుడే 77 పరుగులు సాధించింది.
