https://oktelugu.com/

Konaseema Coconut: కొనసీమ కొబ్బరి ఎప్పుడు పుట్టింది..?

Konaseema Coconut:  ‘కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్నా’ అంటారు పెద్దలు. అంటే కొబ్బరి చెట్టు చేసే మేలు ఎవరూ చేయరని అర్థం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం. అనారోగ్య సమయంలో ముందుగా వ్యాధి గ్రస్తులకు అందించేది కొబ్బరి నీళ్లే. ఇక ఎండు కొబ్బరికి నిత్యం డిమాండ్ ఉంటుంది. గుడికి వెళ్లే వారు దాదాపుగా ఓ కొబ్బరికాయను కొనుక్కొని వెళ్తుంటారు. దేవుడికి భక్తులు కొబ్బరికాయను సమర్పిస్తారంటే కొబ్బరి ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2021 / 09:51 AM IST
    Follow us on

    Konaseema Coconut:  ‘కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్నా’ అంటారు పెద్దలు. అంటే కొబ్బరి చెట్టు చేసే మేలు ఎవరూ చేయరని అర్థం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం. అనారోగ్య సమయంలో ముందుగా వ్యాధి గ్రస్తులకు అందించేది కొబ్బరి నీళ్లే. ఇక ఎండు కొబ్బరికి నిత్యం డిమాండ్ ఉంటుంది. గుడికి వెళ్లే వారు దాదాపుగా ఓ కొబ్బరికాయను కొనుక్కొని వెళ్తుంటారు. దేవుడికి భక్తులు కొబ్బరికాయను సమర్పిస్తారంటే కొబ్బరి ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. కొబ్బరి కాయలతో నూనె తయారు చేస్తారు. ఇప్పుడు తలకు రాసుకునే నూనె కొబ్బరి నుంచే వస్తుంది. మరోవైపు కొత్త జంట జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని పవిత్రమైన కొబ్బరి ఆకులతో తయారు చేసిన పెళ్లి పందిరి కింద పెళ్లి వేడుక జరిపిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న కొబ్బరి ఆంధ్రప్రదేశ్లో ఎలా పుట్టింది. ముఖ్యంగా కొనసీమలో ఎక్కువగా సాగయ్యే కొబ్బరి తోటలు ఎప్పుడు మొదలయ్యాయి..?

    ఏపీలోని కోనసీమ(Konaseema) భౌగోళికంగా ద్వీపంలా ఉంటుంది. మూడు వైపులా గోదావరి ఉండి మధ్యలో కోనసీమ అలరారుతుంది. తీర ప్రాంతంగా బంగాళాఖాతం ఉండడంతో ఇండోనేషియా, థాయిలాండ్ నుంచి కొబ్బరి కాయలు(Coconuts) సముద్రంలోకి కొట్టుకొచ్చాయని స్థానికులు అంటున్నారు. అప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్లు మొలిచాయని, ఆ తరువాత కొబ్బరి తోటలు వెలిశాయని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 21.40 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. అత్యధికంగా కేరళలో 8 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 5.17 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ఆ తరువాత కర్ణాటకలో 4.65 లక్షల హెక్టార్లలో కొబ్బరిని పండిస్తున్నారు. నాలుగో స్థానంలో ఏపీలో 1.30 లక్షల హెక్టార్లలో కొబ్బరి పం పండిస్తున్నారు. కోనసీమలో 54 వేల హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు.

    కొబ్బరి కాయలను ఉత్పత్తి చేయడంలో ఏపీ ముందంజలో ఉంది. 2015 నాటి కోకోనట్ బోర్డ్ లెక్కల ప్రకారం ఏపీలో హెక్టారుకు 14, 997 కొబ్బరికాయలను ఉత్పత్తి చేశారు. ఆ తరువత తమిళనాడులో 14,872, కర్ణాటకలో 9,745, కేరళలో 7,486 కాయలను ప్రతీ హెక్టారుకు పండిస్తున్నారు. విస్తీర్ణంలో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నా ఉత్పాదకలో మాత్రం మొదటి స్థానంలో ఉందని కోకోనట్ బోర్డు తెలిపింది. ఇక 2015లో 184.4 కోట్ల కొబ్బరి కాయలు ఉత్పత్తి జరగగా దేశీయ ఉత్పత్తిలో ఏపీ వాటా 8.44 శాతంగా ఉంది. ఏపీలో కొబ్బరి ఉత్పాదకు కారణం గోదావరి తీరం కావడమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

    కోనసీమలోని రైతులు కొబ్బరి నీల్లు తాగేందుకు అమ్మడానికి ఇష్టపడరు. వారు ఎక్కువగా ఎండిన కొబ్బరిగా మారిన తరువాతే విక్రయిస్తారు. అంటే కొబ్బరొ బొండాలను కురిడీ కొబ్బరిగా మారిన తరువాతే మార్కెట్లోకి తెస్తారు. ఎందుకంటే దీనికి సంవత్సరమంతా డిమాండ్ ఉంటుంది. కేరళ, తమిళనాడుతోపోలిస్తే ఏపీలోని కొబ్బరి కాయలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. అయితే ఏపీ కొబ్బరికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఏపీ నుంచి ఎక్కువగా రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

    బంగాళాఖాతం సముద్రానికి అనుకొనే కోనసీమ ఉండడం వల్ల ఇక్కడి కొబ్బరి రైతులకు నిత్యం వరద ముప్పు ఉంటుంది. 1996లో వచ్చిన తుఫాను కోనసీమపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుఫానుతో వందల మంది కొబ్బరి రైతులు మరణించారు. నవంబర్ 6న జరిగిన ఈ విపత్తుతో కొబ్బరి సాగును కోలుకోకుండా చేసింది. వందల కొద్ది చెట్లు కూలిపోయాయి. మిగిలినవి కూడా దిగుబడి లేకుండా పోయాయి. ముఖ్యంగా అమలాపురం డివిజన్లోని పలు మండలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అప్పుడప్పుడు తుఫానులు వచ్చినా 1996 నాటి విపత్తు మళ్లీ సంభవించలేదు.