Telugu News » Ap » Ghora road accident in kadapa district
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో రెండు బైకులపై ప్రయాణిస్తున్న తండ్రీకుమార్తెతో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.