https://oktelugu.com/

Indians kidnapped : 150 మందిని కిడ్నాప్ చేసిన తాలిబన్లు.. భయం వద్దన్న విదేశాంగ శాఖ

Indians kidnapped: తాలిబన్ల (Taliban) ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. అమాయకులపై దాడులు చేస్తూ తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా 150 మంది పౌరులను కాబుల్ విమానాశ్రయం నుంచి కిడ్నాప్(kidnapped) చేయడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే అందులో ఎక్కువ మంది భారతీయులే(Indians) ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై ప్రయాణికులకు ఇబ్బందులు ఏం లేవని తెలిపింది. కానీ తాలిబన్ ప్రతినిధి మాత్రం ఈ వార్తలను ఖండించారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 21, 2021 / 05:39 PM IST
    Follow us on

    Indians kidnapped: తాలిబన్ల (Taliban) ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. అమాయకులపై దాడులు చేస్తూ తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా 150 మంది పౌరులను కాబుల్ విమానాశ్రయం నుంచి కిడ్నాప్(kidnapped) చేయడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే అందులో ఎక్కువ మంది భారతీయులే(Indians) ఉన్నట్లు తెలుస్తోంది.

    దీంతో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై ప్రయాణికులకు ఇబ్బందులు ఏం లేవని తెలిపింది. కానీ తాలిబన్ ప్రతినిధి మాత్రం ఈ వార్తలను ఖండించారు. భారత వైమానిక విమానం సీ-130 కాబుల్ నుంచి బయలుదేరిన కొద్ది గంటలకే 85 మందిని తరలించింది. ఈ విమానం తజకిస్తాన్ లోని దుషన్ బేలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ సమయంలో భారతీయులతోపాటు 150 మందిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

    తాలిబన్ల ఆధీనంలో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిడ్నాప్ చేసిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో తాలిబన్లు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నాయి. తరువాత వారిని సురక్షితంగా విడుదల చేస్తారని చెప్పాయి. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైపోయింది. అక్కడ మళ్లీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. అమాయకులపై దాడులు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులను గుర్తించి వారిని చంపుతున్నారు. మహిళలపై ఒత్తిడులు పెరుగుతున్నాయి.

    అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలని వివిద దేశాల పౌరులు నిర్ణయించుకున్నా వారిపై సైతం తాలిబన్లు ఆంక్షలు విధిస్తున్నారు. తమ పిల్లలైనా బాగుండాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలను ఇతర దేశాలకు పంపడానికి మహిళలు సిద్ధమవుతున్నారు. అఫ్గాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత తాలిబన్ల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తాలిబన్ల చెరలో చిక్కుకున్న వారికి ప్రాణభయమే తప్ప ఏం కనిపించడం లేదు.

    జాతీయ జెండాలను పట్టుకున్న వారిని హతమారుస్తున్నారు. అఫ్గాన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి మరీ దాడులు నిర్వహిస్తున్నారు. మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారు. తమను వ్యతిరేకించే వారిపై దాడులు చేస్తున్నారు. కానీ ఇప్పటికే వేలాది మంది దేశం విడిచి వెళ్లిపోయారు. లక్షల మంది కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.