Afghanistan: చైనాకు లైన్ క్లియర్.. అప్ఘన్ సంపద ఇలా లూటీ!

పిల్లి పోరు.. పిల్లి పోరు పిట్ట తీర్చినట్టు ఇప్పుడు అమెరికా, అప్ఘనిస్తాన్ మధ్య మైత్రి చెడి తాలిబన్ల రాకతో పక్కనున్న చైనాకు కలిసివచ్చింది. ఎప్పటి నుంచి అప్ఘనిస్తాన్ లోని ఆ విలువైన సంపదపై కన్నేసిన చైనాకు ఇన్నాళ్లు ఆదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అడ్డుగా ఉంది. ఇప్పుడా అడ్డు తొలిగిపోయింది. తాలిబన్లను ఎగదోసిన పాకిస్తాన్, చైనాల పంట పండింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి , చైనా దోపిడీకి అడ్డుకట్ట లేకపోయింది. తాలిబన్లు ఇప్పుడు ఈ ఇద్దరికీ సహకరిస్తారు.దీంతో చైనా […]

Written By: NARESH, Updated On : August 21, 2021 5:30 pm
Follow us on

పిల్లి పోరు.. పిల్లి పోరు పిట్ట తీర్చినట్టు ఇప్పుడు అమెరికా, అప్ఘనిస్తాన్ మధ్య మైత్రి చెడి తాలిబన్ల రాకతో పక్కనున్న చైనాకు కలిసివచ్చింది. ఎప్పటి నుంచి అప్ఘనిస్తాన్ లోని ఆ విలువైన సంపదపై కన్నేసిన చైనాకు ఇన్నాళ్లు ఆదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అడ్డుగా ఉంది. ఇప్పుడా అడ్డు తొలిగిపోయింది. తాలిబన్లను ఎగదోసిన పాకిస్తాన్, చైనాల పంట పండింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి , చైనా దోపిడీకి అడ్డుకట్ట లేకపోయింది. తాలిబన్లు ఇప్పుడు ఈ ఇద్దరికీ సహకరిస్తారు.దీంతో చైనా కు పట్టపగ్గాలేకుండా పోయింది.

అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడం చైనాకు కలిసివచ్చేలానే ఉంది. ఇప్పటికే ఆ దేశంలో అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన చైనాకు త్వరలో వాటిని అత్యంత సులభంగా తన దేశంలోకి తరలించుకుపోయేందుకు వీలు చిక్కింది.

అప్థాన్ సరిహద్దు ప్రావిన్స్ బదక్షాన్ లోని నజాక్ ప్రాంతంలో చైనా 50 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సిద్ధమైంది. దీని నిర్మాణాన్ని 2020లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 20శాతం పని మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన 80శాతం పూర్తయితే బదక్షాన్ నుంచి చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ కు రాకపోకలు సులభంగా చేసుకోవచ్చు.

అప్ఘనిస్తాన్ లో దొరికే అరుదైన ‘రేర్ ఎర్త్’ ఖనిజాలపై చైనా ఎన్నడో కన్నేసింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దాన్ని చైనాకు తరలించడం డ్రాగన్ దేశానికి చాలా సులువు. ఈ అరుదైన ఖనిజాన్ని కంప్యూటర్లు, రీచార్జబుల్ బ్యాటరీలు, పవన విద్యుత్, టర్బయిన్లు, హైబ్రీడ్ కార్ల తయారీలో వాడుతారు. ఈ ఖనిజాలు చాలా కీలకం.ఇప్పటికే అప్ఘాన్ తో చైనా ఈ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. త్వరలో తాలిబన్లు అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రహదారి పూర్తయితే ఇక చైనాకు ఈ విలువైన ఖనిజం ఈజీగా చేరుతుంది. ఇప్పుడు చైనాకు అనుకూల తాలిబన్ ప్రభుత్వం రావడంతో చైనాకు ఇది లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.