Do you know that these remake movies are super hit than the original
Remake movies: సినిమా ఇండస్ట్రీలో ఒక కథ రాసుకుంటే ఆ కథలోకి మరొక హీరో వచ్చి ఆ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఒక కథ ఒక భాషలో తెరకెక్కితే దానిని ఇంకో భాషలో మరొక హీరో హీరోతో చేసి సూపర్ సక్సెస్ లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చిరంజీవి చేసిన ‘ఘరానా మొగుడు’ సినిమా అయితే తన ఒరిజినల్ సినిమా అయిన ‘అనురాగ అరలితు ‘ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.
ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించినప్పటికీ తెలుగులో మాత్రం చిరంజీవి ఈ సినిమాను చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఒరిజినల్ కంటే కూడా ఘరానా మొగుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా జనాల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.ఇక చిరంజీవి తన నటన తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాని చూసి ఆయన చేసిన ఒరిజినల్ కంటే ఈ సినిమానే సూపర్ గా ఉంది అని చెప్పడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చంటి ‘ సినిమా కూడా తమిళ్ సినిమా అయిన ‘చిన్న తంబీ’ కి రీమేక్ గా తెరకెక్కింది.అయితే ఈ సినిమా తమిళ్ సినిమా కంటే కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా వెంకటేష్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో ఇది టాప్ ప్లేస్ లో నిలుస్తుంది.
అయితే ఈ సినిమా సక్సెస్ ని సాధించడంలో వెంకటేష్ కూడా కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. అప్పటివరకు వెంకటేష్ ఇలాంటి పాత్రను చేస్తాడా లేదా అని అందరిలో ఒక డౌట్ అయితే ఉండేది. కానీ తన అలవోకగా ఆ పాత్రలో నటించి జీవించాడనే చెప్పాలి…