
మాజీ డీజీపి ప్రసాదరావు కన్నుమూశారు. ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. బి. ప్రసాదరావు 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, డీజీపీగా, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 1997 లో ఆయన భారత పోలీసు, 2006లో రాష్ట్రపతి పతకాలు అందుకున్నారు. వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకాన్ని రాశారు.