ప్చ్.. ‘రాజు’గారి మనసంతా బూతు మయమే !

ఏమిటి రాజు గారికి ఏమైంది ? పెద్దరికం వచ్చాక ఆయన మనసు మొత్తం బూతు మయం అయిపోయిందేమిటి ? ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే, యావత్తు తెలుగు సినీ జనం ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు. అసలు ఎం.ఎస్ రాజు అంటేనే భారీ సినిమాలు, అలాగే ఆయన ఆలోచనల శైలి కూడా అంతా భారీ తనం. కానీ రోజులు మారాయి, ఆయన ప్రభ, వైభవం అంతా గతం అయిపోయింది. వర్తమానం రాజుగారు […]

Written By: admin, Updated On : May 10, 2021 9:36 am
Follow us on

ఏమిటి రాజు గారికి ఏమైంది ? పెద్దరికం వచ్చాక ఆయన మనసు మొత్తం బూతు మయం అయిపోయిందేమిటి ? ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే, యావత్తు తెలుగు సినీ జనం ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు. అసలు ఎం.ఎస్ రాజు అంటేనే భారీ సినిమాలు, అలాగే ఆయన ఆలోచనల శైలి కూడా అంతా భారీ తనం. కానీ రోజులు మారాయి, ఆయన ప్రభ, వైభవం అంతా గతం అయిపోయింది.

వర్తమానం రాజుగారు బూతు సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి నానాకష్టాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఒక భారీ నిర్మాత, దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ అనే బూతు సినిమా తీసి హిట్ కొట్టడంతో రాజుగారికి డైరెక్టర్ గా మరో సినిమా వచ్చింది. నిజానికి ‘డర్టీ హరి’ కేవలం బోల్డ్ నెస్ తోనే హిట్ అయింది.

ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగిన ఆ సినిమా నిండా బూతులు, బోల్డ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఉన్నాయనే సినిమా హిట్ అయిందనే అపోహలో రాజుగారు ఉన్నారేమో, ఆయన మళ్ళీ బూతు సినిమాకి శ్రీకారం చుట్టారు. అయినా సినిమాలో మెయిన్ పాయింట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ,

ఓన్లీ, కిస్ లు హగ్ ల వల్ల సినిమా హిట్ అవ్వదు. కానీ, రాజుగారు మాత్రం హద్దులు మీరిన సన్నివేశాలతో దర్శకుడిగా అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలను రాసుకుని సినిమాలు తీసుకుంటూ పోవాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ తో మరో బోల్డ్ సినిమా చేస్తున్నాడు. జూన్ 7న ఈ చిత్రం చిత్రీకరణను కూడా ప్రారంభించనున్నాడు. మరి రాజుగారు ‘7 డేస్ లో 6 నైట్స్’గా ఏమి చూపిస్తారో చూడాలి.