అనుకున్నది సాధించినా.. జగన్ కు ఆ అనందం కరువే..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జీవితం అడ్డంకులమయంగా మారుతోంది. తాను కష్టపడి అనుకున్నది సాధిస్తున్నా ఆ ఆనందం ఆస్వాదించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సమయానుకూలమో.. ఇంకేదో తెలియదు గానీ జగన్ విజయానందానికి మాత్రం అన్నీ అడ్డంకుల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అష్టకష్టాలు పడి ముళ్లకిరీటంలా ఉన్న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న యంగ్ లీడర్ కు సామాజిక పరిస్థితులు కలిసివస్తున్నా.. ప్రకృతి మాత్రం సహకరించడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ జగన్ సీఎం జీవితానికి నిద్రలేకుండా చేస్తోంది. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబుపై […]

Written By: NARESH, Updated On : May 10, 2021 9:43 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జీవితం అడ్డంకులమయంగా మారుతోంది. తాను కష్టపడి అనుకున్నది సాధిస్తున్నా ఆ ఆనందం ఆస్వాదించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సమయానుకూలమో.. ఇంకేదో తెలియదు గానీ జగన్ విజయానందానికి మాత్రం అన్నీ అడ్డంకుల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అష్టకష్టాలు పడి ముళ్లకిరీటంలా ఉన్న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న యంగ్ లీడర్ కు సామాజిక పరిస్థితులు కలిసివస్తున్నా.. ప్రకృతి మాత్రం సహకరించడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ జగన్ సీఎం జీవితానికి నిద్రలేకుండా చేస్తోంది.

2014లో అధికారం చేపట్టిన చంద్రబాబుపై ఐదేళ్లు విసుగు చెందిన ఏపీ ప్రజలు ఆ తరువాత జగన్ ను పీటంపై కూర్చొబెట్టారు. అయితే వైసీపీ స్థాపించిన జగన్ ఏపీ సీఎం కుర్చీపై కూర్చొవడానికి ఓవర్ నైట్ స్టార్ లీడర్ కాలేదు. వారసత్వంగానూ రాలేదు.. దాదాపు ఏడేళ్లపాటు ఎంతో శ్రమించి ప్రజల్లో కలిసిపోయి.. వారి కష్టసుఖాలను తెలుసుకున్న తరువాత వారి సమస్యల పరిష్కారానికి ఓ దారి చూపాడు. దీంతో జగన్ తమకు దేవుడిలా కనిపించిన తరువాత ఆయనను గద్దెనెక్కించారు.

అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలనలో సెట్ అయ్యే వరకు సంవత్సరం పట్టింది. ఆ తరువాత మహమ్మారి కరోనా ప్రపంచంలో భాగంగా ఏపీని అతలాకుతలం చేసింది. తీరిక లేకుండా శ్రమించిన జగన్ కు ముఖ్యమంత్రిగా ఏడాది గడిపిన సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తరువాత కొన్ని రోజులకు వైరస్ కేసుల సంఖ్య తగ్గిందని కాస్త రిలీఫ్ తీసుకునే సమయానికి ఎన్నికల గోల మెడకు పట్టుకుంటి. ఎలక్షన్ కమిషన్ తో ఫైట్ చేసినా చివరికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

అయితే వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జగన్ శ్రమను ప్రజలు గుర్తించినట్లయింది. అన్ని చోట్లా తిరుగులేని విజయాలను సాధించిన జగన్ కు ఆ సంతోషాన్ని గడుపుకునే అవకాశం మరోసారి లేకుండా పోయింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఏపీలోనూ విజృంభిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్ కు నిద్రలేకుండా పోయింది. దీంతో మే 30న జగన్ రెండేళ్ల సంబరాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక వచ్చే సంవత్సరం అయినా అవకాశం ఉంటుందా..? అంటే అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయోనరి వైసీపీ నాయకులు మదనపడుతున్నారు. ఏదీ ఏమైనా జగన్ అనుకున్నది సాధించినా ఆనందించే ఆస్కారం లేకుండా పోయిందని చర్చించుకుంటున్నారు.