
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్ ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ తాలిబన్లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రీప్టెడ్ మెసేజ్ లను పంపే వాట్సాప్ ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోవడం గమనార్హం. ఫేస్ బుక్ ప్రతినిధి మాట్లాడుతూ అఫ్టాన్ లో పరిస్థితిని తమ సంస్థ నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్ ఖాతాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.