నటీనటులు: మంజు వారియర్, సన్నీ వేన్, అలెన్సియర్ లోపేజ్ తదితరులు;
దర్శకత్వం: రంజిత్ కమలా శంకర్, సలిల్;
సంగీతం: డాన్ విన్సెంట్;
సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం;
ఎడిటింగ్: మనోజ్;
నిర్మాత: జిస్ టామ్స్, జస్టిస్ థామస్, మంజు వారియర్;
రచన: అభయ్ కుమార్, అనిల్ కురియన్;
విడుదల: ఆహా
ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను డబ్ చేస్తూ వస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. అయితే మలయాళంలో వచ్చిన మరో ఆసక్తికర చిత్రం ‘చతుర్ ముఖం’. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం..
కథ :
తేజస్విని (మంజు వారియర్) కి ఫోన్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె తన ఫ్రెండ్ ఆంటోని(సన్నీ వేన్)తో కలిసి సీసీటీవీ సొల్యూషన్ పేరుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా తేజస్విని ఫోన్ నీటి కొలనులో పడిపోవడంతో.. ఆన్ లైన్ లో ఒక ఫోన్ బుక్ చేస్తుంది. ఆ ఫోన్ తేజస్విని దగ్గరికి వచ్చినప్పటి నుంచి.. ఆమె చుట్టూ వింతగా జరుగుతుంటాయి. చివరకు తేజస్వినికి ఆ ఫోన్ వల్ల ఓ ఆపద వస్తోంది ? ఇంతకీ ఆమెకు వచ్చిన ఆపద ఏంటి? ఆ ఆపద నుండి ఆమె ఎలా బయట పడింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఏ జీవినైనా నడిపించేది ఓ శక్తి అని చాలామంది నమ్మకం. అయితే ప్రాణం పోయినప్పుడు ఆ శక్తి మరో ప్రాణిలోకి లేదా వస్తువులోకి ప్రవేశిస్తే.. ఇదే పాయింట్ తో వచ్చింది ‘చతుర్ ముఖం’. ఒక టెక్నో థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగున్నాయి. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ కు ఎంతలా బానిస అవుతున్నారో చాలా బాగా చూపించారు.
ఇక సినిమాలో ఊహించని ట్విస్ట్ లు బాగున్నాయి. అలాగే కథ, కథనాలు కూడా ఆసక్తిగా సాగాయి. సెకండ్ హాఫ్ సన్నివేశాలు కూడా ఉత్కంఠగా సాగాయి. ముఖ్యంగా నాలుగైదు పాత్రలతోనే దర్శకుడు సినిమాని నడిపించిన విధానం బాగుంది. కీలక పాత్రలో నటించిన మంజు వారియర్ అద్భుతంగా నటించింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో నటించిన సన్నీ వేన్, అలెన్సియర్ లోపేజ్ కూడా తమ పాత్రల్లో జీవించారు.
అయితే, కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, అలాగే ‘ప్లే’లో లాజిక్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్ చూశామన్న భావన అయితే కలుగుతుంది. కాకపోతే సైన్స్, నెగెటివ్ ఎనర్జీ పై సాగే సీన్స్ సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగించకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
కథలోని వైవిధ్యం,
నటీనటులు నటన,
సాంకేతిక బృందం పనితనం,
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే,
మెయిన్ ప్లాట్ లో లాజిక్స్ మిస్ అవ్వడం,
సినిమా చూడాలా ? వద్దా ?
భిన్నమైన కాన్సెప్ట్ తో, లోతైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది. కాకపోతే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు. మొత్తమ్మీద, ఎవరైనా ఈ సినిమాని ఒకసారి హ్యాపీ గా చూడొచ్చు.