
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ వచ్చారు. నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. భాజపాలో చేరిన తర్వాత తొలిసారిగా హూజూరాబాద్ పర్యటనకు వచ్చిన ఈటలకు కాట్రపల్లి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా నాగారం, నగురంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.