Telangana Dsc Job: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. అయితే ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే భర్తీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్ డీఎస్సీ. 11,063 ఉద్యోగ ఖాళీలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిషికేషన్ ఇచ్చింది విద్యాశాఖ. జూలై చివరి నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబర్‌లో ఫలితాలు ప్రకటించింది. దసరాకు ముందు అంటే అక్టోబర్‌లో నియామకాలు పూర్తి చేసింది. అయితే ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం సాంకేతిక కారణాలతో నిలిపివేసింది. నవంబర్‌లో అవి కూడా భర్తీ చేసింది. అయితే నిర్మల్ జిల్లాలో 2వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఉద్యోగం రాలేదు. దీంతో నియమక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతునా్నయి.
ఏం జరిగిందంటే..
డీఎస్సీ-2024 స్పెషల్ ఎడు్యకేషన్ ఎస్జీటీ విభాగంలో నిర్మల్ జిల్లా 2వ రా్యంకు సాధించినా.. తనకు 1:1 కౌన్సెలింగ్‌కు పిలవలేదని, ఉద్యోగం రాలేదని జిల్లాలోని కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన బాధితుడు చందుల వీరేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2012లో వీరేశ్ స్పెషల్ ఎడ్యుకేన్లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. దానికి అనుబంధంగా ఆరు నెలల కోర్సు బెంగళూరులో చదివాడు. దాదాపు పదేళ్లుగా ప్రత్యేక పిల్లలకు కుభీర్‌లో విద్యాబోధన చేస్తున్నాడు. అయితే 2024లో డీఎస్సీ రాశాడు స్పెషల్ ఎడ్యుకుషన్ పోస్టు కోసం పరీక్ష రాశడు. జిల్లాలో 20కిపైగా పోస్టులు ఉన్నాయి. వీరేశ్ 2వ ర్యాంకు సాధించాడు. అయినా ఉద్యోగం రాలేదు.
1:1కు పిలవని అధికారులు..
మొతగ 1:3 పద్ధతిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వీరేశ్‌కు పిలుపు వచి్చంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత 1:1 సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటించలేదు. నవంబర్ 2న సాయంత్రం 6 గంటలకు పిలిచి రాత్రి 9 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచా్చరు. ఇందులో వీరేశ్‌కు ఉద్యోం రాలేదు. 1:3 కి సెలెక్ట్ అయి అకో్టబర్ 29 సర్టిఇకెట్ వెరిఫికేషన్ చేసుకున్నా.. వెరిఫికేషన్‌లో తనకు ఎలాంటి రిమార్క్ లేకోయినా 1:1 లిస్టులో జాబ్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరికి ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకపోయినా పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించాడు. స్పీచ్ థెరపీ టెక్నీషియన్‌కు స్పెషల్ ఎడ్యుకేటర్‌గా పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించాడు.
వేరే జిల్లాల్లో పోస్టింగ్…
తనకు ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ఇతర జిల్లాలో అధికారులు పోస్టింగ్ ఇచ్చాడు. తనను 1:1 కు ఎందుకు పిలవలేదని వీరేశ్ డీఈవోను అడిగితే కావాల్సిన క్వాలిఫికేసన్ లేదని చెబుతున్నారని తెలిపాడు. ఇతర జిల్లాలో తనకున్న విద్యార్హత సరిపోయినప్పుడు.. నిర్మల్ జిల్లాలో ఎందకు సరిపోలేదని ప్రశ్నిస్తున్నాడు. తనతో పాటు చదివిన వారికి ఉద్యోగం వచ్చిందని, తనకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం చెబితే క్వాలిఫికేషన్‌పై క్లారిటీ తీసుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నాడు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని వేడుకుంటున్నాడు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Doubts on the recruitment process that even the 2nd ranked candidate in dsc did not get a job
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com