Nandamuri Balakrishna : 5 దశాబ్దాల బాలయ్య బాబు సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తో పాటు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని కూడా ఎదురుకున్నాడు. అదే విధంగా ఆయన చేయని జానర్ అంటూ ఏది మిగలలేదు. ఆయన తండ్రిగారు ఎన్టీఆర్ తర్వాత అన్ని రకాల పాత్రలు, జానర్స్ చేసిన ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాదు, సేవ కార్యక్రమాల్లో కూడా బాలయ్య బాబు తన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. తన తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ని నడుపుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అర్హత ఉన్నవారికి ఉచితంగా ఎన్నో వేల ఆపరేషన్స్ చేయించాడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
హిందూపురం నుండి ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఆయనది. 2019 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ రాయలసీమ జిల్లాలో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్స్ మాత్రమే గెలిచింది. ఆ నాలుగు సీట్స్ లో బాలయ్య హిందూపురం సీటు కూడా ఒకటి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆయనకు జనాల్లో ఎంతటి ఆదరణ ఉంది అనేది. ఇలా ఒక వ్యక్తిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాలయ్య చూడాల్సినవన్నీ చూసేసాడు. అయితే ఆయనకి ఒక కల మిగిలిపోయింది. సినిమా ఇండస్ట్రీ కోసం ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ లాంటి భారీ సినీ స్టూడియో ని నిర్మించాలి అనేది ఆయన చిరకాల కోరిక. కేవలం ఆంధ్ర లోనే కాదు, తెలంగాణ లో కూడా నిర్మించాలని అనుకున్నాడు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థలాలు ఇవ్వలేదు. రీసెంట్ గానే తెలంగాణ లో స్టూడియో కట్టుకోవడానికి రెవిన్యూ శాఖ అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా స్థలాలు మంజూరు చేశారట. విజయవాడ, హైదరాబాద్ కి మధ్యలో ఈ స్థలాన్ని కేటాయించినట్టు, అందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేసినట్టు తెలుస్తుంది.
కాబట్టి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినీ స్టూడియోస్ ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్ లో టాప్ 2 స్టూడియోస్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ,అన్నపూర్ణ స్టూడియోస్. ఆ తర్వాత రామానాయుడు స్టూడియోస్, సారధి స్టూడియోస్ వంటివి ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఒక్క స్టూడియో కూడా లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో స్టూడియో ని నిర్మిస్తే సినీ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. మరి బాలయ్య నిర్మించబోయే స్టూడియోస్ ఆంధ్ర ప్రదేశ్ కి సినీ ఇండస్ట్రీ ని షిఫ్ట్ చేసే రేంజ్ ప్రభావం చూపిస్తుందా లేదా అనేది చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bala krishna cine studios are going to start soon in two telugu states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com