Japan : ప్రపంచానికి అవసరమయ్యే సాంకేతిక పరికరాలలో 1/3 వంతు జపాన్లో తయారవుతున్నాయంటే అక్కడ సాంకేతిక రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ లో మాత్రమే కాకుండా అన్ని విభాగాలలో జపాన్ ముందు వరుసలో ఉంది. అందువల్లే విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ ఆర్థికాభివృద్ధిలో పెద్ద దేశాల కంటే జపాన్ ముందు వరసలో ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో కొత్త కొత్త ప్రయోగాలు చేసే జపాన్.. ప్రపంచానికి బుల్లెట్ రైలు ను పరిచయం చేసింది. ప్రపంచంలో మిగతా దేశాలు ఆవిష్కరణను అందుకోక ముందే.. ఇప్పుడు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. జపాన్ రాజధాని టోక్యో నుంచి ఒసాకా వరకు ఏకంగా 515 కిలోమీటర్ల దూరంలో సరికొత్తగా సరుకు రవాణా వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. దీని కోసం ఏకంగా ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్పోర్ట్ కారిడార్ (కన్వర్ బెల్ట్ రోడ్డు) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇటువంటి వ్యవస్థను ఇంతవరకు ఏ దేశం కూడా నిర్మించలేదు. సాంకేతికంగా ఈ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. అందువల్లే దీని గురించి జపాన్ దేశం గొప్పగా చెప్పుకుంటున్నది. గ్లోబల్ వీడియోస్ ఐటమ్ దీనిని అధునాతనమైన ఆవిష్కరణగా చెబుతోంది.
అద్భుతాల పుట్ట
జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కారిడార్ అద్భుతంగా ఉంటుందట. దీనిని “ఆటో ఫ్లో రోడ్డు” అని పిలుస్తున్నారు. ప్రతిరోజు 25వేల మంది ట్రక్ డ్రైవర్లు చేసే పని ఈ కారిడార్ చేస్తుందని జపాన్ అధికారులు చెబుతున్నారు. జపాన్ దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత విపరీతంగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందువల్లే జపాన్ ఈ కారిడార్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. 2027 లేదా 28 సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. 2030 తర్వాత ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ” ఇది గొప్ప ఆవిష్కరణ. సరుకు రవాణాను మరింత వేగవంతం చేయడం కోసమే దీనిని ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటల పాటు ఇందులో సరుగు రవాణా జరుగుతుంటుంది. ఇది పూర్తిగా మానవ రహిత రవాణా వ్యవస్థ. దీనివల్ల సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయని” జపాన్ చెబుతోంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఈ కారిడార్ లో ఆటో ఫ్లో రోడ్డు ఉంటుంది. దీనిపై వేరువేరైనా మూడు మార్గాలు ఉంటాయి. కార్గో ప్యాలెట్స్(సరుకును మోసుకెళ్లే డ్రైవర్ రహిత వాహనాలు,) వీటిపై పరుగులు పెడతాయి. కార్గో ప్యాలెట్స్ ను రోబోటిక్స్ సహాయంతో నియంత్రిస్తారు. నిర్దేశిత ప్రాంతం రాగానే కార్గో ప్యాలెస్ నుంచి సరుకును పై భాగంలో ఉన్న రోబోటిక్స్ కింద పడేస్తాయి. ఇదే సమయంలో అన్లోడింగ్ లిప్త పాటు కాలంలో జరిగిపోతుంది.. ఈ ప్రక్రియలో సరుకుకు ఏమాత్రం నష్టం వాటిల్లదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A new automated cargo transport corridor has been launched at a distance of 515 km from tokyo to osaka the capital of japan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com