Indian Railways : మన దేశంలో చాలా మందికి విలువైన బైక్‌లు.. అంతకన్నా విలువైన కార్లు.. అంతకు మించిన హెలిక్యాప్టర్లు, విమానాలు, షిప్‌లు ఉన్నాయి. ఇక మన దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ అయితే రైల్వేలే సొంత రైలు ఎవరికీ లేదు. కానీ, ఓ రైతు.. ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. దేశంలో రైళ్లను భారత రైల్వే సంస్థ నడిపిస్తోంది అనేది అందరికీ తెలుసు. మరి రైతు ఎలా రైలుకు ఓనర్ అయ్యాడు. దాని వెనుక ఉన్న కథ ఏంటి.. ఆ రైతు ఏ రైలుకు ఓనర్ అయ్యాడు. భారత చరిత్రలో అరుదైన ఈ ఘటన నేపథ్యంలో ఏంటి అనేవి తెలుసుకుందాం.
రైతు రైలుకు ఓనర్ ఎలా అయ్యాడంటే?
పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఓ రైతు రైలుకు ఓనర్ అయ్యాడు. 2007లో లూథియానా–చండీగఢ్ రైల్వేలైన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ చేపట్టారు. కటానా అనే గ్రామంలో రైల్వేలైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించారు. కొద్ది నెలల తేడాలో పక్కనే ఉన్న మరో గ్రామంలో రైతులకు ఎకరాకు రూ.71 లక్షల పరిహారం అందించారు. ఈ విషయం కటానా గ్రామంలోని సంపూరణ్ సింగ్‌కు తెలిసిందితను కూడా రైల్వే లైన్ కోసం భూమి ఇచ్చాడు. పరిహారం చెల్లింపులో తేడాపై కోర్టును ఆశ్రయించాడు. తమకు కూడా పక్క గ్రామంలో ఇచ్చినట్లుగా పరిహారం ఇప్పించాలని కోరాడు.
ఎకరాకు రూ.50 లక్షలు ఇస్తామన్న రైల్వేశాఖ
దీంతో దిగివచ్చిన భారత రైల్వే శాఖ.. సంపూణ్‌సింగ్‌తో చర్చలు జరిపింది. ఎకరాకు రూ.50 లక్షలు ఇస్తామని తెలిపింది. అయినా ఆయన అంగీకరించలేదు. సంపూరణ్‌సింగ్‌కు ఇవ్వాల్సిన పరిహారం కోటిన్నరకు పెరిగింది. ఈమొత్తాన్ని నార్తన్ రైల్వే 2015లోగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. 2017 నాటికి కేవలం రూ.42 లక్షలు మాత్రమే చెల్లించింది.
మళ్లీ కోర్టుకు సంపూరణ్‌సింగ్..
ఈ క్రమంలో 2017లో సంపూరణ్‌సింగ్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు తీర్పు ఇచ్చినా తనకు రావాల్సిన పరిహారం అందించలేదని తెలిపారు. దీనిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. ఈ క్రమంలో డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి జస్పాల వర్మ సంచలన తీర్పు ఇచ్చారు. ఢిల్లీ–అమృత్‌సర్ స్వర్ణశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు లూథియానాలోని రైల్వే స్షేన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశించారు. పరిహారం కింద వాటిని సంపూరణ్‌సింగ్‌కు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పులూ సంపూరణ్ సింగ్ స్వర్ణశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ఓనర్ అయ్యాడు. అంతేకాకుండా సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తర్వాత రైల్వే శాఖ పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంలో న్యాయస్థానం తన ఆదేశాలు వెనక్కి తీసుకుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Indian railways mistake made a farmer the owner for a swarna shatabdi express train
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com