Photo Story: ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి.. ఆయన జర్నీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను స్టాట్ చేసి కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని నవ్వించి.. ఆ తర్వాత హీరోగా తన సత్తా చాటాడు నటుడు సుధీర్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న మ్యాజిక్ లు చేశాడు. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారం అవుతున్నా జబర్ధస్త్ షోలోకి అడుగుపెట్టాడు.

Written By: Swathi Chilukuri, Updated On : March 26, 2024 5:31 pm

Photo Story

Follow us on

Photo Story: సోషల్ మీడియా వల్ల ఏ చిన్న విషయం అయినా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. సెలబ్రెటీలకు సంబంధించిన చిన్న విషయం తెలిసినా సరే లైక్ లు, షేర్ లు చేయడంలో ముందుంటారు అభిమానులు. వారికి సంబంధించి చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు కూడా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు అభిమానులు. అయితే ప్రస్తుతం మరో సెలబ్రెటీకి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏంటి అనుకుంటున్నారా?

మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉంది ఎవరో గుర్తు పట్టారా? బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన నటుడు ఈయన. ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పటికి అయినా గుర్తు వచ్చిందా ఈ ఫోటోలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని.. అదేనండి మ్యాజిక్ లు చేస్తూ మంచి నటుడుగా గుర్తింపు సంపాదించిన సుధీర్.

ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను స్టాట్ చేసి కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని నవ్వించి.. ఆ తర్వాత హీరోగా తన సత్తా చాటాడు నటుడు సుధీర్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న మ్యాజిక్ లు చేశాడు. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారం అవుతున్నా జబర్ధస్త్ షోలోకి అడుగుపెట్టాడు. ఈ షో ఆయన లైఫ్ ను మొత్తంగా మార్చేసిందనే చెప్పాలి. అందులో కమెడియన్ గా ఎదిగిన ఈయన హోస్ట్ గా ఇతర షోలను కూడా రన్ చేశాడు అంటే ఆయన రేంజ్ ను అర్థం చేసుకోవచ్చు.

బుల్లితెరపై అలరించిన సుదీర్.. హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, కాలింగ్ సహస్ర, గాలోడు వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన రేంజ్ ను పెంచినా ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ కాలేదు. ప్రస్తుతం జీ.వో.ఏ.టీ అనే సినిమాలో నటిస్తున్నాడు సుధీర్. ఇందులో సుధీర్ హీరోగా నటిస్తే దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. మరి చిన్నప్పుడు అమాయకంగా కనిపించే ఈ నటుడు బలే ఎదిగిపోయాడు కదా.