Anasuya Bharadwaj: అనసూయకు వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహం కలుగుతుంది. ఆమె గ్లామర్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. చలువ కళ్ళజోడు పెట్టి మరింత కవ్వించింది. హాట్ సమ్మర్ లో అనసూయ కూల్ లుక్ వైరల్ గా మారింది. అనసూయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. ఆమె లేటెస్ట్ మూవీ రజాకార్. ఈ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేసింది. ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహ ఇతర ప్రధాన పాత్రలు చేయడం జరిగింది.
రజాకార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ పొలిటికల్ ప్రాపగాండా మూవీగా కొందరు విమర్శలు చేశారు. చరిత్రను వక్రీకరించి తెరకెక్కించారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే గూడూర్ నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నెక్స్ట్ అనసూయ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో అనసూయ లేడీ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆర్సీ 17 ప్రకటించారు. సుకుమార్-రామ్ చరణ్ మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్ర చేసింది. అనసూయకు బ్రేక్ ఇచ్చిన రోల్ అది. తన ప్రతి సినిమాలో అనసూయకు సుకుమార్ ఒక పాత్ర ఇస్తున్నాడు. ఆర్సీ 17లో కూడా అనసూయ కోసం ఆయన ఓ రోల్ సిద్ధం చేస్తాడు అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి ఫోకస్ నటనపై పెట్టిన సంగతి తెలిసిందే.
దాదాపు తొమ్మిదేళ్లు అనసూయ జబర్దస్త్ లో ఉన్నారు. గ్లామరస్ యాంకర్ గా ఒక ట్రెండ్ సెట్ చేసింది. నటిగా సినిమాకు లక్షల పారితోషికం తీసుకుంటున్న అనసూయ… ప్రొమోషన్స్ ద్వారా కూడా భారీగా ఆర్జిస్తోంది. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సందడి చేస్తున్నారు. పలు నగరాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తుంది. ఎక్కడకు వెళ్లినా అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. యూత్ లో అనసూయకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి…