Disha Patani: ఆమెది ఉత్తరాది ప్రాంతం. ఉత్తరాఖండ్ సొంత రాష్ట్రం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ అనే సినిమాతోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది ఆమె దిశాపటాని అని.. లోఫర్ సినిమా ప్లాఫ్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ ఎంఎస్ ధోని బయోపిక్ లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి. కుంగ్ ఫు యోగా, వెల్ కమ్ టు న్యూ యార్క్ బాఘి -2 , బాఘి – 3, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్న్స్అనే సినిమాల్లో నటించింది. భాఘి సినిమా హీరో టైగర్ ష్రాప్ తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అతనితో ఆమె రిలేషన్ లో ఉంది.
తాజాగా యోధ అనే సినిమాలో నటించింది. ధోని సినిమాలో నటనకి గానూ దిశ కు స్టార్ స్క్రీన్ అవార్డు లభించింది. స్టార్ డస్ట్, ఐఐ ఎఫ్ ఏ పురస్కారాలు లభించాయి. బాఘి -2 సినిమాకు లక్స్ అవార్డు లభించింది. సినిమాల కంటే ఫోటో షూట్లతో దిశ ఎక్కువ పాపులర్. కెల్విన్ కెవిన్ అనే లో దుస్తుల తయారీ సంస్థ కు ఆమె అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ కు సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు దిశ హాట్ హాట్ ఫొటో షూట్ లు నిర్వహిస్తూ ఉంటుంది. అంతే కాదు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ మెరుస్తోంది.
ఇటీవల దిశ నటించిన యోధ విజయవంతమైంది..ఈ సినిమా హిట్ ను ఆస్వాదిస్తున్న దిశ ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నది. తెల్లటి ఉల్లిపోర దుస్తుల్లో దేవ కన్య లాగా మెరిసి పోతోంది. మెత్తటి, తెల్లటి పరుపు పై హొయలు పోతూ స్టిల్స్ ఇచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. దిశ అందాల ప్రదర్శన పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, కొన్ని సంవత్సరాల నుంచి టైగర్ తో సహజీవనం చేస్తున్న దిశ.. త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు మొత్తం పూర్తిచేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని దిశ భావిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై దిశ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.