https://oktelugu.com/

Supritha: వామ్మో సుప్రిత స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగిందా?

లైసెన్స్ లేకుండా కారు నడపడం కిక్ కోసం చేసిన పని అని సమాధానం ఇచ్చింది సుప్రిత. తనకు 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మ పడుకుంటే కారు తీసుకొని మరీ వెళ్లేదట. ఒకసారి వాళ్ల అమ్మకు దొరికిపోతే చాలా కొట్టిందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 27, 2024 / 02:42 PM IST

    Supritha

    Follow us on

    Supritha: అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్ గా రాబోతున్న సినిమా బ్యాడ్ బాయ్. కానీ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడల్ట్ షోకి గెస్టులుగా వచ్చారు ఇద్దరు. రీతూ చౌదరి యాంకర్ అవడంతో తను చేసిన పనులు అన్నీ బయటపెట్టింది సుప్రిత. కిక్, క్రాక్, బలుపు తో చేసే పనులు ఉంటాయి అందులో మీరు ఏం చేశారు అని అడిగింది రీతు. దానికి సుప్రత ఏం అని సమాధానాలు ఇచ్చిందో తెలుసా?

    లైసెన్స్ లేకుండా కారు నడపడం కిక్ కోసం చేసిన పని అని సమాధానం ఇచ్చింది సుప్రిత. తనకు 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మ పడుకుంటే కారు తీసుకొని మరీ వెళ్లేదట. ఒకసారి వాళ్ల అమ్మకు దొరికిపోతే చాలా కొట్టిందట. ఇది సరిపోదు ఇంకా కిక్ కావాలని అడిగింది రీతు. దాంతో పక్కనే ఉన్న అమర్ దీప్.. నేను ఫ్రెండ్స్ తో మందు కొట్టి ఆ సీసాలు దొరకకుండా దాచిపెట్టే వాన్ని అంటూ తను చేసిన కిక్ పనులు చెప్పాడు. ఇక పదవ తరగతిలో సుప్రిత మందు కొట్టిన విషయాన్ని బయటపెట్టింది.

    తను కూడా అమర్ చేసినట్టు చేసిందట కానీ చెప్పలేదట. టెన్త్ క్లాస్ లో తాను చేసిన తీట పని అంటూ చెప్పింది. తనకు ఓ గ్యాంగ్ ఉండేదట. వాళ్లందరికీ స్పైట్ లో మందు కలుపుకొని తాగాలనే కోరిక ఉండేదట. అదే విధంగా అమ్మకు తెలియకుండా స్పైట్ బాటిల్ లో మందు కలిపి స్కూల్ కు తీసుకొని వెళ్లిందట. కానీ కోర్డినేటర్ కి దొరికిపోయారట. క్రాక్ పని గురించి చెబుతూ.. తను ఇష్టపడ్డ అమ్మాయి తనను మాత్రమే చూడాలని అనుకునేవాడట అమర్. తన వైపు ఒక లుక్ అయినా వేయాలనే పిచ్చి ఉండేదట.

    తను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే వేరే వ్యక్తి వచ్చి డిస్టర్బ్ చేశాడట.. ఆ అమ్మాయి అతన్ని చూసేసరికి పక్కనే ఉన్న సీసాను పగలగొట్టాడట. అప్పుడు తగిలిన గాయాన్ని కూడా చూపించాడు అమర్. ఇక ఇదే పని సుప్రిత చెబుతూ.. నన్నే చూడాలి అనుకోలేదు కానీ.. వేరే అమ్మాయి ఆయనను చూస్తే వెళ్లి అమ్మాయిని కొట్టేదాన్ని అని చెప్పింది సురేఖావాణి పుత్రికా రత్నం సుప్రిత.