https://oktelugu.com/

Tollywood: హీరోలు విలనిజం చేసినా కూడా హిట్ అవుతున్నాయా? ఆ సినిమాలు ఏంటంటే..

కృష్ణ మనోహర్ ని చూసి నేర్చుకోవాల్సింది పోయి పండు గాన్ని చూసి చాలా నేర్చుకున్నారు యూత్. కానీ ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 27, 2024 / 02:54 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: సినిమా అంటే మంచిని నేర్పించాలి కానీ చెడును నేర్పిస్తే సినిమా బాగుంటుందా? కానీ అలాంటి సినిమాలు హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. హీరో అంటే మంచిని పెంచేలా.. చెడును నిర్మూలించేలా ఉండాలి. కానీ కొన్ని సినిమాలు అలా కాకుండా పూర్తి విరుద్దంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏంటో ఓ సారి చూసేయండి.

    ఇడియట్.. అమ్మాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ముద్దు పెట్టు, కౌగిలించుకో అంటూ హీరోయిన్ ను వేధిస్తాడు హీరో.

    పోకిరి.. కృష్ణ మనోహర్ ని చూసి నేర్చుకోవాల్సింది పోయి పండు గాన్ని చూసి చాలా నేర్చుకున్నారు యూత్. కానీ ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

    చిత్రం. దర్శకుడు మెసేజ్ ఇద్దాం అనుకుంటే పూర్తి విరుద్ధంగా మారింది సినిమా.

    ఖతర్నాక్.. గురువుli గౌరవించడం నేర్పించాలి కానీ ఈ సినిమా అందుకు వ్యతిరేకంగా ఉంటుంది.

    అర్జున్ రెడ్డి.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో, హీరోయిన్ పాత్రలు రెండు కూడా యూత్ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. దారుణంగా ఉన్న ఈ క్యారెక్టర్ లు పెద్దలకు కోపం తెప్పించాయి. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్.

    నేను లోకల్.. ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం జీవితంలో స్థిర పడి వచ్చిన వ్యక్తి విలన్. కానీ అమ్మాయిని వేధిస్తూ.. ఆమె తండ్రిని కించపరుస్తూ చదువు, ఉద్యోగం లేకుండా ఉన్న వ్యక్తి మాత్రం హీరో. కానీ ఈ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

    హార్ట్ ఎటాక్.. అమ్మాయిని ప్రేమిస్తే ఆమెతోనే ఉండాలి కానీ ముద్దు పెట్టు చాలు ఇంకేం వద్దు అంటాడు. ఇది హీరోయిజం.

    ఉప్పెన.. పేద వ్యక్తి దగ్గర దొరికిన స్వేచ్ఛను ప్రేమ అనుకొని.. సరిగ్గా జీవితం అంటే ఏంటో తెలియని ఒక అమ్మాయి తండ్రిని వదులుకోవడానికి సిద్దం అవుతుంది. అతనితో ఉండేందుకు సిద్ధపడుతుంది.

    పుష్ప. ఒక నేరస్తుడే హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అతన్ని అడ్డుకున్న పోలీసులు విలన్ లు అయ్యారు. హీరో మేనరిజాన్ని అభిమానించారు ప్రేక్షకులు.