Homeఎంటర్టైన్మెంట్Lenin 8 Days Box Office Collection: 'లెనిన్' 8 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Lenin 8 Days Box Office Collection: ‘లెనిన్’ 8 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇలా అయితే చాలా కష్టం అయ్యగారు..

Lenin 8 Days Box Office Collection: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడమే కాకుండా, అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. స్టడీ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ సినిమా , అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద 8 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి ?, ఇప్పటి వరకు ఎంత లాభాలు వచ్చాయి అనేది ఒకసారి వివరంగా చూద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందట.

8 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 3 కోట్ల 7 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 30 లక్షలు వచ్చాయి. అదే విధంగా ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 37 లక్షలు, గుంటూరు నుండి 2 కోట్ల రూపాయిలు , కృష్ణా నుండి 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా నుండి ఈ చిత్రానికి 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, నేటితో 1 కోటి రూపాయిల షేర్ మార్కుని అందుకోనుంది. ఓవరాల్ గా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ నుండి ఈ చిత్రానికి 25 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 42 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 31 కోట్ల 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 56 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, ఇప్పటి వరకు 9 కోట్ల 15 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. అయితే అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ రేంజ్ కి చేరడం కష్టమే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 75 నుండి 80 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version