https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబుతో సూపర్ హిట్ కొడతాను అని కృష్ణ కి మాట ఇచ్చి డిజాస్టర్ తీసిన దర్శకుడు ఎవరో తెలుసా..?

మొదట్లో ఒకటి రెండు సినిమాలు ప్లాప్ లు వచ్చాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చి మహేష్ బాబుకి నేను సక్సెస్ ఇస్తాను అని కృష్ణ తో చెప్పాడు.

Written By: , Updated On : March 27, 2024 / 10:50 AM IST
Mahesh Babu disaster movies

Mahesh Babu disaster movies

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తోనే జనాలు అతన్ని నటుడిగా యాక్సెప్ట్ చేశారు. దానివల్లే ఆయన తర్వాత సినిమాలు కూడా స్టార్ డైరెక్టర్లతో చేసే అవకాశాలు వచ్చాయి. అయితే మొదట్లో ఒకటి రెండు సినిమాలు ప్లాప్ లు వచ్చాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చి మహేష్ బాబుకి నేను సక్సెస్ ఇస్తాను అని కృష్ణ తో చెప్పాడు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు ఇండస్ట్రీకి మోసగాళ్లు మోసగాడు అనే సినిమాతో కౌబాయ్ సినిమాలను పరిచయం చేశాడు. ఇక అదే జోనర్ ని రిపీట్ చేస్తూ ‘టక్కరి దొంగ’ అనే సినిమా తీసి జయంత్ సి పరంజి మహేష్ కి ఒక సూపర్ హిట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమా ప్లాప్ అయింది. అందువల్లే మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఆయన కృష్ణకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే మహేష్ బాబు హీరోగా ఉన్నప్పుడు కౌబాయ్ సినిమాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేసుంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికి మహేష్ బాబు ఇండస్ట్రీకి కొత్త కాబట్టి జనాలు కూడా అతన్ని ఆ క్యారెక్టర్ లో యాక్సెప్ట్ చేసేవారు. ఇక కౌబాయ్ సినిమాలో అయితే అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సీన్ లో కూడా సినిమాకి సంబంధించిన స్టోరీ ని ఎలివేట్ చేయాల్సి ఉంటుంది.

ఈ సినిమాలో అవి రెండు మిస్ అవ్వడం వల్లే సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక మొత్తానికైతే మహేష్ బాబుకి భారీ డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులలో జయంతి సి పరాంజి కూడా ఒకడుగా మిగిలాడు…ఇక ఈయన డైరెక్షన్ లో మరొకసారి మహేష్ బాబు నటించిన లేదు.