Mahesh Babu: హీరో మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చారు. చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఫ్యాన్స్ ని మహేష్ అలరించాడు. ఆయన క్యారెక్టరైజేషన్, మేనరిజమ్, డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ పడేలా ఉన్నాయి. నెగిటివ్ టాక్ తో కూడా గుంటూరు కారం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. కాగా నెక్స్ట్ మహేష్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంచెం సమయం ఉంది. ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు.
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సీతారలతో కలిసి విదేశాలకు పయనం అయ్యాడు. మహేష్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చారు. విరామం దొరికితే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లడం మహేష్ కి అలవాటు. ప్రతి ఏడాది పలుమార్లు విదేశాలకు వెళతారు. అలాగే తన సినిమా విడుదలయ్యాక, కొత్త సినిమా ప్రారంభానికి ముందు కూడా వెకేషన్ కి వెళతారు. కుటుంబంతో విహారాలు చేయడం మహేష్ కి ఇష్టమైన వ్యాపకం.
అయితే మహేష్ విదేశాలకు వెళుతుండగా… ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి మూవీ ఎప్పుడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు సినిమాను స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఇది రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి మరింత సమయం తీసుకునే అవకాశం కలదు. అందుకే వీలైనంత త్వరగా మూవీ స్టార్ట్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా దర్శకుడు రాజమౌళి మొదటిసారి మహేష్ తో పని చేస్తున్నారు. ఆయన కోసం యూనివర్సల్ సబ్జెక్టు సిద్ధం చేశాడు. ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ తో చేయనున్న మూవీ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే తెలియజేశాడు. ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని రాజమౌళి వెల్లడించారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. మహేష్ ప్రపంచ వీరుడిగా కనిపిస్తాడట.