Indonesia: పాముల రక్తాన్ని తాగే అమ్మాయిలు.. కారణం తెలుసా?

విష సర్పాన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అవును ఈ దేశంలో పాము రక్తాన్ని తాగుతారట. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి, చర్మ సౌందర్యానికి వీరు పాము రక్తాన్ని తాగుతారట.

Written By: Swathi Chilukuri, Updated On : March 27, 2024 10:54 am

Indonesia

Follow us on

Indonesia: పాము పేరు వింటే దైవం గుర్తుకు వచ్చేవారు కొందరు అయితే మరికొందరికి మాత్రం వణుకు వస్తుంది.కానీ కొందరు విషసర్పం రక్తం తాగుతారు. అదే వారికి మందు, ఆరోగ్యం. విషపూరితమైన నాగుపాము రక్తాన్ని తాగే అమ్మాయిలు ఉన్నారంటే నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. టీ, కాఫీలు తాగినంత ఈజీగా, ఇష్టంగా తాగే ఓ దేశమే ఉందండోయ్. అందం, ఆరోగ్యం అని నమ్మి విషసర్పం రక్తాన్ని తాగే ఆ వింత మనుషులు ఎవరు? ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుసుకుందాం.

విష సర్పాన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అవును ఈ దేశంలో పాము రక్తాన్ని తాగుతారట. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి, చర్మ సౌందర్యానికి వీరు పాము రక్తాన్ని తాగుతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఫుల్ గా ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం సర్వసాధారణం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ అన్నట్టుగా పాము రక్తాన్ని విక్రమిస్తారట. తాగుతారట కూడా.

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తం పక్కా రుచి చూస్తారట. అంతేకాదు జకర్తాలో ఫుల్ డిమాండ్, ట్రెండ్ కూడా ఉందట. దీని వల్ల ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత 3 నుంచి 4 గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్ లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతారో అక్కడ పాము రక్తం అలాగే తాగుతారట. మరి ఇంతకీ దీన్ని ఎందుకు సేవిస్తారు అనే అనుమానం కూడా వచ్చిందా?

ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి మహిళలు అందంగా ఉండాలని పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం మెరుస్తుందట. శరీరం ఆరోగ్యంగా ఉండాలనే ప్రధానం కారణమట. ఇండోనేషియాలో పాము రక్తం తాగే సంప్రదాయం పురాతనమైనది అని అంటారు అక్కడి ప్రజలు. తాగడం మాత్రమే కాదు తింటారట కూడా. నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ పాములను తింటారట. పాము రక్తాన్ని అన్నం వైన్ తో కూడా కలిపి తింటారట.