
దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో కనీసం మరో వారమైనా లాక్ డౌన్ పొడిగించాలని మెజారిటి ఢిల్లీ వాసుల అభిప్రాయంగా ఉంది. లోకల్ సర్కిల్స్ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది మరో రెండు వారాలు లాక్ డౌడ్ పొడిగించాలని కేజ్రీవాల్ ను కోరగా 68 శాతం మంది కనీసం మరో వారం రోజులైనా లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయపడ్డారు.