https://oktelugu.com/

‘చికెన్’ తినేవారికి ఈ న్యూస్

కరోనా వైరస్ వచ్చిన కొత్తల్లో ఇది కోళ్ల ద్వారా వ్యాపిస్తుందని వదంతలు రావడంతో చికెన్ తినడాన్ని అందరూ మానేశారు. అయితే సీఎం కేసీఆర్, జగన్ సహా వైద్య నిపుణులు అంతా చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. కరోనాను తట్టుకునే శక్తి వస్తుందని తెలుపడంతో అందరూ చికెన్ కోసం ఎగబడ్డారు. దాంతో పోయిన సమ్మర్ లో చికెన్ రేటు 300 దాటింది. అయితే తాజాగా ఏపీలో సెకండ్ వేవ్ మొదలు కావడం.. మళ్లీ చికెన్ ధరలకు డిమాండ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2021 6:57 pm
    Follow us on

    కరోనా వైరస్ వచ్చిన కొత్తల్లో ఇది కోళ్ల ద్వారా వ్యాపిస్తుందని వదంతలు రావడంతో చికెన్ తినడాన్ని అందరూ మానేశారు. అయితే సీఎం కేసీఆర్, జగన్ సహా వైద్య నిపుణులు అంతా చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. కరోనాను తట్టుకునే శక్తి వస్తుందని తెలుపడంతో అందరూ చికెన్ కోసం ఎగబడ్డారు. దాంతో పోయిన సమ్మర్ లో చికెన్ రేటు 300 దాటింది.

    అయితే తాజాగా ఏపీలో సెకండ్ వేవ్ మొదలు కావడం.. మళ్లీ చికెన్ ధరలకు డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోవడం కలకలం రేపింది. కేజీ చికెన్ ధర తాజాగా రూ.80వరకు పతనమైంది.

    గత వారం రోజుల కింత ఏపీలో చికెన్ కిలో రూ.220 అమ్మగా.. ప్రస్తుతం ఆ ధర రూ.140-150కి పడిపోయింది. ఫామ్ గేట్ ధర గత వారం 120 ఉండగా.. తాజాగా రూ.80 రూపాయలు మాత్రమే పలుకుతోంది. వేసవిలో 30శాతం ధరలు పడిపోవడం గమనార్హం.

    అయితే ఉత్పత్తి పెరగడం.. వేసవి కారణంగా ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవడం.. అన్నింటిని దుకాణాలకు తరలించడంతో ధర తగ్గిందని సమాచారం. కరోనా ప్రభావంతో కూలీలందరూ స్వస్థలాలకు పోవడంతో పౌల్ట్రీలు మూతపడ్డాయి. అన్ని కోళ్లను మార్కెట్లోకి తరలించారు. దీంతో చికెన్ ధరలు ఏపీలో పడిపోయాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఎంతకో అంతకు అమ్మేసి కోళ్లను వదిలించుకుంటున్నారు. ఇదే జరిగితే ఇప్పుడు ధర తగ్గి రాబోయే రోజుల్లో చికెన్ కొరతతో ధర పెరిగే చాన్స్ ఉంది.