
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా 808 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,27,498కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,698కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,061 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 6,12,096 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.